హైదరాబాద్లో గ్లోబల్ ఫార్మా సదస్సు

హైదరాబాద్లో గ్లోబల్ ఫార్మా సదస్సు

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్ ఫార్మా ఏఐ, కంప్లయన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు (జీపీఏసీటీఎస్) 2026ను  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హెచ్ఐసీసీలో వచ్చే నెల మూడో తేదీన నిర్వహిస్తారు.  దాదాపు 400 మంది సీనియర్ లీడర్లు, ఎక్స్​పర్టులు, అధికారులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఫార్మా రంగంలో ఏఐ, డిజిటల్ తయారీ, డేటా భద్రత, సైబర్ భద్రత, నియంత్రణ నిబంధనలపై సదస్సులో చర్చిస్తారు. ఆల్కెమ్​ ల్యాబ్స్​, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్​, వొకార్డ్, గ్రాన్యూల్స్, ‘బయలాజికల్ ఈ’ సంస్థల సీనియర్ లీడర్లు పాల్గొంటారు. ఫార్మా రంగంలో డిజిటల్ మార్పులను వేగవంతం చేయడం, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడంపై జీపీఏసీటీఎస్ దృష్టి పెడుతుంది.