హైదరాబాద్, వెలుగు: ఆదాయం అంతగా లేని స్టార్టప్స్‌కు సాయం చేయడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ బిజ్లాబ్స్ ఎక్సిలరేటర్ ప్రోగ్రామ్ మూడో సీజన్ ను ప్రకటించింది. 2026 ఆగస్టు నుంచి 2027 అక్టోబర్ వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా వందకుపైగా స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం, నిధులను అందజేస్తారు.
ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్, ఐఐఎం బెంగళూరు, హైదరాబాద్ టీ–-హబ్, ఐఐటీ ఢిల్లీ వంటి ఐదు ఇంక్యుబేటర్లు ఈ కార్యక్రమం కోసం చేతులు కలిపాయి. తూర్పు, ఈశాన్య భారత్ ప్రాంతీయ స్టార్టప్ కేంద్రాలకు మద్దతు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. అగ్రిటెక్, ఫిన్‌టెక్, క్లీన్ ఎనర్జీ, హెల్త్‌టెక్ రంగాలలోని కొత్త స్టార్టప్‌లు దీని ద్వారా లబ్ధి పొందనున్నాయి.
డీపీఐఐటీ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవాలి. బిజ్లాబ్స్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల యువ పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోటక్ తెలిపింది.
