మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది ..అమెరికా ఆంక్షలకు ఇరాన్ మంత్రి కౌంటర్

మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది ..అమెరికా ఆంక్షలకు ఇరాన్ మంత్రి కౌంటర్

టెహ్రాన్: అమెరికా విధించిన కొత్త ఆంక్షలను తిప్పికొట్టేందుకు తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అన్నారు. అమెరికాకు మరో ఓటమి తప్పదని ఆయన పేర్కొన్నారు.‘‘ఇరాన్ ప్రజల, దేశ అధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వారు చేయగలిగినదంతా చేశారు. కానీ ప్రతిసారీ విఫలమయ్యారు. 

వారు మరో ఓటమిని చవిచూడాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది” అని మదానిజాదే సోమవారం ప్రభుత్వ టీవీ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘మేం ఈ ప్రణాళికల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలను మేనేజ్ చేయడానికి తగిన ప్రణాళిక ఉంది. 

శత్రువులకు తగిన బదులు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఆయన తెలిపారు. అలాగే, అమెరికా ఆంక్షలను చైనా, రష్యా సహా ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఆమోదించలేదని, ఇతర భాగస్వామ్య దేశాలు కూడా ప్రతిఘటిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

హార్మూజ్ వద్ద ఆయిల్ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి

హార్మూజ్ జలసంధి ప్రవేశ ద్వారం వద్ద ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరంలో మంగళవారం ఒక ఆయిల్ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్షిపణి దాడి జరిగిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. మరోవైపు, హార్మూజ్ జలసంధి రవాణా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 45 ట్యాంకర్లను ఇరాన్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేసిందని.. జరిమానాలు, నిర్బంధం, కార్గో జప్తు చేస్తామని బెదిరించినట్లు ‘రాయిటర్స్’ తెలిపింది.

 అలాగే, ప్రాంతీయ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో పాక్​ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఖతార్ మంత్రి చర్చల కోసం ఇరాన్ చేరుకున్నారు. హార్మూజ్ భవిష్యత్ ఏర్పాట్లపై చర్చించేందుకు ఒమన్ విదేశాంగ మంత్రి కూడా మంగళవారం టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు.