కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా 44 పోస్టులు ఖాళీగా ఉంటే 1593 అప్లికేషన్లు అందాయి. ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 8 పోస్టులకు 609 అప్లికేషన్లు, ఐసీడీఎస్ గంగాధర ప్రాజెక్టు పరిధిలో 20 పోస్టులకు 535, హుజురాబాద్ ప్రాజెక్టు పరిధిలో 16 పోస్టులకు 449 అప్లికేషన్లు అందాయి.
హుజురాబాద్, గంగాధర ప్రాజెక్టుల పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు, కరీంనగర్ అర్బన్ పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
