న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడు వారాల్లోగా జైలు అధికారుల ముందు ఆయన లొంగిపోవాలని మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2013నాటి లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది.10 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, దిగువ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేయాలంటే ముందు లొంగిపోవాల్సి ఉంటుంది.
