పెళ్లి పేరుతో మోసం.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పై కేసు...

పెళ్లి పేరుతో మోసం.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పై కేసు...

ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బాలస్వామి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. 2017 నుంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం కొనసాగించాడని... 2024లో ఆయనకు భార్యాపిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. 2025 జనవరి నుంచి తనను దూరం పెడుతున్నాడని.. మానసికంగా కుంగిపోయి చికిత్స తీసుకుంటున్నాని తెలిపింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైదాబాద్ పోలీసులు.

2016లో బాలస్వామితో పరిచయం ఏర్పడిందని.. 2017లో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది బాధితురాలు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో సంబంధం కొనసాగించానని తెలిపింది బాధితురాలు. 2021లో తన భర్త మరణించాడని.. ఆ తర్వాత బాలస్వామితో శారీరక సంబంధం కొనసాగించానని.. 2024 తనకు భార్యాపిల్లలు ఉన్న విషయంపై ప్రశ్నించగా..తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడని తెలిపింది బాధితురాలు.

2025 జనవరి నుంచి బాలాస్వామి తనను దూరంగా పెట్టాడని.. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురై చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది బాధితురాలు. తనను నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగికంగా దోపిడీ చేశారని ఫిర్యాదు చేసింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు సైదాబాద్ పోలీసులు.