ములుగు రాజీవ్ రహదారిపై అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు

ములుగు రాజీవ్ రహదారిపై అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు

ములుగు రాజీవ్ రహదారిపై RTC బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఆసిఫ్ బాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. 

ములుగు డబుల్ బెడ్రూంల దగ్గరకు రాగానే డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఓవర్ టెక్ చేసేందుకు యత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్డు దగ్గర ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పెరుక అంజిబాబు మృతి చెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ అంజిబాబు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకుని జైపూర్ పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు హైవే సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.