హైదరాబాద్, వెలుగు: గ్రీన్కోకు చెందిన ఏఎం ఇంటెలిజెన్స్ ఆసియాలోనే మొట్టమొదటి ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 9,000 ఎన్విడియా రూబిన్ జీపీయూలను ఆర్డర్చేసింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఏఐ ఫ్యాక్టరీ 2027 మొదటి క్వార్టర్లో అందుబాటులోకి రానుంది.
తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎనిమిది బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.76,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏఐ కంప్యూట్‌గా మార్చడంలో ఈ ప్రాజెక్టు కీలకమని ఏఎంఐ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు.
అత్యంత సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను సమర్థవంతంగా నడపడానికి వెరా రూబిన్ ఆర్కిటెక్చర్ భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో భారత్, అమెరికా, యూరప్‌లో ఐదు గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని ఏఎంఐ లక్ష్యంగా పెట్టుకుంది. అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుందని అనిల్ తెలిపారు.
