హైదరాబాద్, వెలుగు: డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు సేవలు అందించే హైదరాబాద్కంపెనీ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బ్రిటన్ కంపెనీ రోల్స్ రాయిస్తో సుమారు రూ.1,600 కోట్ల విలువైన మరో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో భాగస్వామ్యం మొత్తం విలువ రూ.5,400 కోట్లకు చేరింది.
అంతకుముందు రూ.3,800 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ తాజా భాగస్వామ్యం ద్వారా ఏరో-ఇంజిన్ రింగులు, కేసింగ్స్, ఇతర కీలక విడిభాగాలను భారత్, బ్రిటన్ లోని ప్లాంట్లలో తయారు చేయనున్నారు. దీని ద్వారా రోల్స్ రాయిస్ సంస్థకు ప్రత్యామ్నాయ తయారీ మార్గం అందుబాటులోకి వస్తుంది.
ఇటీవల బ్రిటన్ కు చెందిన బ్రాంఫోర్డ్ ప్రెసిషన్ సొల్యూషన్స్‌ను సిగ్మా కొనుగోలు చేసింది. దీంతో భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయని సిగ్మా సీఈవో సునీల్ కలిదిండి పేర్కొన్నారు.
