సెప్టెంబర్ 11న బ్యాంకుల సమ్మె

సెప్టెంబర్ 11న బ్యాంకుల సమ్మె

న్యూఢిల్లీ:  ‘వారానికి 5 రోజుల బ్యాంకింగ్’ విధానాన్ని ఇంకా అమలు చేయకపోవడం, పనితీరును బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో వివక్ష, పెన్షన్ సమస్యలు వంటివి పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ యూనియన్లు సెప్టెంబర్ 11న సమ్మె చేయాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 11 (శుక్రవారం) సమ్మె, తర్వాతి రెండు రోజులు వారాంతపు సెలవులు, 14న వినాయక చవితి కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలు 4 రోజుల పాటు ఆగిపోయే  ప్రమాదం ఉంది. 

అంతేకాకుండా హాఫ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లోజింగ్ సమయంలో సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె, సమస్యలు తేలకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని తొమ్మిది యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీయూ)  స్పష్టం చేసింది.