రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులో విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులు

రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులో విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులు

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సాయిగణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్ ఇండస్ట్రీస్​లో సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన విజిలెన్స్, సివిల్ ​సప్లై ఆఫీసర్లు రైడ్​ చేశారు. 2022–-23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సి ఉండగా..  జూన్​ 3న సదరు రైస్​మిల్లు ఓనర్లకు అధికారులు నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో సోమవారం రైడ్​ చేశారు.

4,946.080 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.18,35,83,057 బకాయి ఉన్నట్లు అధికారులు తేల్చారు. మూడు రోజుల్లో అమౌంట్​ చెల్లించకపోతే రైసు మిల్లు యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి సివిల్​ సప్లై జిల్లా మేనేజరు ఎన్​.ఆంజనేయులు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం, సీఐ పండరి, ఎస్సై సాంబశివరావు, సివిల్​సప్లై డీటీలు ప్రసాద్, పరమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.