బిహార్లో రూ.2.3 కోట్ల సైబర్ మోసం.. అచ్చంపేట యువకుడికి ఆ రాష్ట్ర పోలీసుల నోటీసులు

బిహార్లో రూ.2.3 కోట్ల సైబర్ మోసం.. అచ్చంపేట యువకుడికి ఆ రాష్ట్ర పోలీసుల నోటీసులు

అచ్చంపేట, వెలుగు: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2.3 కోట్ల సైబర్ మోసం చేసిన అచ్చంపేట యువకుడికి ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు అందజేశారు. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అచ్చంపేటకు చెందిన అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర పోలీసులు  అచ్చంపేటకు వచ్చి పరారీలో ఉన్న అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి నోటీసులు అంటించారు. కాలనీలో టామ్ టామ్ సైతం వేయించి ఇంటికి నోటీసులు అంటించారు.

నిర్ణీత గడువులోగా పోలీసుల ఎదుట హాజరుకావాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇంటిని వేలం వేసి, ఆస్తులు జప్తు చేసే చర్యలు చేపడతామని హెచ్చరించినట్లు తెలిసింది. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన పలువురు వ్యక్తుల మొబైల్ ఫోన్లకు వివిధ రకాల లింకులు పంపించి వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడినట్లు సమాచారం.