- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
కల్వకుర్తి, వెలుగు: నిశ్చితార్థం జరిగిన రోజే ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలంలోని గుండూర్ గ్రామానికి చెందిన పోతుగంటి నరేందర్(26) ఆదివారం నిశ్చితార్థం అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి స్నేహితులతో కలిసి కల్వకుర్తికి వచ్చి తిరిగి గుండూర్‌కు కారులో బయలుదేరారు.
పంజుగుల గ్రామ సమీపంలోని ఎయిర్‌టెల్ టవర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. అనంతరం కారు బోల్తా పడటంతో నరేందర్ కారు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరితో పాటు కారులోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు డ్రైవర్ బాల్‌రాజ్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, ఘటన అనంతరం అతడు పరారరయ్యాడని నరేందర్ తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
