కొళత్తూరు ఓటమిపై కోర్టుకెక్కిన స్టాలిన్‌‌‌‌

కొళత్తూరు ఓటమిపై కోర్టుకెక్కిన స్టాలిన్‌‌‌‌

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూరు నుంచి టీవీకే అభ్యర్థి వీఎస్‌‌‌‌ బాబు గెలుపును డీఎంకే చీఫ్​, మాజీ సీఎం స్టాలిన్‌‌‌‌ మద్రాస్‌‌‌‌ హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. ఎన్నికల టైంలో ఈవీఎంలలో లోపాలు, వీవీప్యాట్‌‌‌‌ యంత్రాల విషయంలో అవకతవకలు జరిగా యని పిటిషన్‌‌‌‌లో ఆరోపించారు. కొళత్తూరు నియోజకవర్గంలో ఓట్లను మరోసారి లెక్కించాలని కోర్టును కోరారు. 

బాబు ఎన్నికను చెల్లనిదిగా తేల్చి తనను విజేతగా ప్రకటించాలని స్టాలిన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌లో అభ్యర్థించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌‌‌‌పై వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొళత్తూరు నుంచి మూడుసార్లు గెలిచిన స్టాలిన్.. నాలుగోసారి ఓటమి చవిచూశారు.