గట్టుప్పల్, వెలుగు: నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం అంతంపేట ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఎ.శేఖర్‌ను అదే మండలం శేరిగూడెం స్కూల్‌కు డిప్యుటేషన్‌పై పంపించడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ టీచర్ వెళ్లినప్పటి నుంచి పిల్లలకు సరిగా పాఠాలు చెప్పేవారు లేక చదువులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరెంట్స్ వినతిపై కలెక్టర్ స్పందించి విచారణ చేయాలని డీఈవోను ఆదేశించారు.
