త్వరలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కంపెనీ మివి నుంచి స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌

త్వరలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కంపెనీ మివి నుంచి స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ట్రూ వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్), బ్లూటూత్ స్పీకర్లు, ఏఐ ఇయర్‌‌‌‌‌‌‌‌బడ్స్, సౌండ్‌‌‌‌‌‌‌‌బార్లు వంటి ఆడియో ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లతో కస్టమర్లకు చేరువైన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కంపెనీ మివి, త్వరలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ ద్వారా దీనిని అమ్మనుంది.  

ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఈ మివి ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్‌‌‌‌‌‌‌‌లో ఉండే అవకాశం ఉంది. ఫోన్ పేరు, విడుదల తేదీ, ఫీచర్లు, ధర వంటి కీలక వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌‌‌‌‌ల బ్రాండ్ బోల్ట్ కూడా 'బోల్ట్' పేరిట రెండు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు బోల్ట్ ఎవో 4జీ, బోల్ట్ ఏస్‌‌‌‌‌‌‌‌ 5జీలను విడుదల చేయనుంది.