ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌ ప్రణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనిసా చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌ ప్రణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనిసా చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కనిసా (హంగేరి): ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం. ప్రణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిష్టాత్మక కనిసా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వాదిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించాడు. ఫలితంగా ఆడిన తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. 

పెట్రోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీతో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెల్లపావులతో ఆడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాస్త నెమ్మదించినా వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి జర్మనీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. తమిళనాడులోని కారైకుడికి చెందిన ప్రణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44వ స్థానంలో ఉన్నాడు. ఇండియాకే చెందిన కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటరామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆండ్రీ వోలోకిటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఏడు పాయింట్లు సాధించారు.