హైదరాబాద్, వెలుగు: సన్ టీవీ నెట్‌వర్క్ మైక్రో డ్రామా రంగంలోకి అడుగుపెట్టింది. మొబైల్స్, టీవీల కోసం సన్ నెక్స్ట్ షార్ట్స్ పేరుతో ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. చిన్న కథలతో కస్టమర్లను ఆకట్టుకుంటామని తెలిపింది. ఇందులో 150కి పైగా ఒరిజినల్ టైటిల్స్ ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ సినిమాలను, జెమిని టీవీ సీరియల్స్‌ను ఫాస్ట్ పేస్డ్ షార్ట్ ఫార్మాట్ ఎపిసోడ్లుగా మార్చారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో వీటిని చూడవచ్చు. నందిని, శుభ సంకల్పం, శివంగి వంటి పాపులర్ సీరియల్స్ షార్ట్స్రూపంలో ప్రసారమవుతాయి. యువతను ఆకర్షించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని సన్‌టీవీ తెలిపింది.
