జెలియో మొబిలిటీకి  కొత్తగా 45 డీలర్లు

జెలియో మొబిలిటీకి  కొత్తగా 45 డీలర్లు

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ విస్తరణకు ప్రముఖ ఈవీ సంస్థ జెలియో ఈ-–మొబిలిటీ భారీ ప్రణాళికలు ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో 150 కంటే ఎక్కువ కొత్త డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను 2027  నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఏపీలో 30, తెలంగాణలో 15 ఔట్​లెట్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం 25 రాష్ట్రాల్లో 400 పైగా డీలర్లు ఉండగా, ఈ కొత్త విస్తరణతో దేశవ్యాప్తంగా మొత్తం నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ 550 దాటనుంది.  

కంపెనీ ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరులో 39 వేల చదరపు అడుగుల్లో ప్లాంటును ప్రారంభించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో జెలియో ఆదాయం 81.8 శాతం వార్షిక వృద్ధితో రూ.313.68 కోట్లకు చేరింది.