ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు షాక్.. 57 మెట్రో స్టేషన్ల మూసివేతపై కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు షాక్.. 57 మెట్రో స్టేషన్ల మూసివేతపై  కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. 2026 అక్టోబర్ 10న (శనివారం) కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టనున్న నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు విధించిన కఠిన పరిమితులపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది.   శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ మెట్రో 57 స్టేషన్లను మూసివేయాలన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెట్రో స్టేషన్ల మూసివేత సాధారణ పౌరుల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆందోళనలకు, ప్రజల సౌకర్యాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

 ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న ఢిల్లీలో సీజేపీ ర్యాలీకి సిద్ధమైన విషయం తెలిసిందే.   దీనికి సంబంధించి 20 వేలకు   పైగా పోలీసు, పారామిలటరీ సిబ్బందిని  ఢిల్లీలో మోహరించారు. పోలీసులు మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, సరిహద్దు చెక్‌లు, హోటళ్లలో కొత్త బుకింగ్‌లు నిలిపివేత వంటి చర్యలు తీసుకున్నారు. 

ఈ పరిమితులపై కపిల్ సిబల్, అభిషేక్ మను సింగ్వీ, ప్రశాంత్ భూషణ్, వృందా గ్రోవర్ వంటి సీనియర్ న్యాయవాదులు సుప్రీంలో వాదనలు వినిపించారు. ఈ రిస్ట్రిక్షన్స్ అవసరానికి మించి ఉన్నాయని..  సాధారణ ప్రయాణికులను ప్రభావితం చేస్తాయని  వాదించారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున చట్టం-శాంతి నిర్వహణకు ఈ చర్యలు అవసరమని సమర్థించారు. అయితే న్యాయమూర్తి జయమాల్యా బగ్చి కల్పించుకుని..  నిరసన హక్కు, సాధారణ పౌరుల ప్రాథమిక సౌకర్యాల హక్కు మధ్య సమతుల్యత అవసరమని పేర్కొన్నారు. 

ALSO READ : గుండెపోటుతో మరణిస్తే 'అన్ నాచురల్ డెత్' కేస్ ఎందుకు?

నిరసనకారుల సంఖ్యను పరిమితం చేయడం, ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసనలు జరిగేలా చూడటం,  హైవేలను మూసివేయకుండా చూడటం వంటి  త చర్యలు సాధ్యమని కోర్టు సూచించింది.

 నిరసన హక్కును రక్షిస్తూనే ఇతర పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయకుండా సమతుల్యత సాధించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.