తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటుడు నానా పాటేకర్ మరణం ఒక్క సినీ ప్రపంచాన్ని మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గోవాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారని వార్తలు రాగా.. గోవా పోలీసులు మాత్రం 'అన్‌నాచురల్ డెత్' (Unnatural Death - ) కేస్ నమోదు చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ కేసు నమోదు వెనుక అసలు కారణమేంటి? ఏదైనా పోలీసులకు అనుమానం వచ్చిందా? అన్న దానిపై చర్చ నడుస్తోంది.
పోలీసు దర్యాప్తు
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)లోని సెక్షన్ 194 ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఈ Unnatural Death కేస్ అంటే నేరం జరిగిందని అర్థం కాదు. ఒక ప్రముఖ వ్యక్తి ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే మరణించి ఉన్నప్పుడు (Brought Dead), మరణానికి దారితీసిన అసలు కారణాలను, కాలానుగుణ సంఘటనలను అధికారికంగా రికార్డు చేయడానికి ఈ ఇన్క్వెస్ట్ ప్రక్రియ తప్పనిసరి.
ఆఖరి గంటల్లో ఏం జరిగింది?
నానా పాటేకర్ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సుమారు 2.30 గంటల సమయంలో తనకు ఎడమవైపు నొప్పిగా ఉందని స్నేహితుడికి సందేశం పంపినట్లు ఓ నివేదిక పేర్కొంది. అనంతరం ఉదయం వైద్య సహాయం అందించి, సీపీఆర్ ద్వారా ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రి వైద్యులు గుండెపోటును ప్రాథమిక కారణంగా పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి.
మరో వైపు అక్టోబర్ 8 ఉదయం 8:07 గంటలకు బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆస్పత్రి నుంచి పనాజీ పోలీసులకు ఫోన్ వెళ్ళింది. 75 ఏళ్ల నాగా పటేకర్ స్పృహలేకుండా పడిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని పోలీసులకు తెలిపారు.
అయితే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక విచారణ కోసం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆఖరి నిమిషాల్లో అక్కడ ఏం జరిగింది? ఆయనకు ముందుగా ఎవరు వైద్య సాయం అందించారు? అన్నది స్పష్టం చేసేందుకు నాగా పటేకర్ భార్య నీలకంతి, కుమారుడు మల్హర్ పటేకర్, అలాగే ఆయన వ్యక్తిగత కేర్‌టేకర్, చికిత్స అందించిన డాక్టర్ల స్టేట్‌మెంట్లను పనాజీ సీనియర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నితిన్ నాయక్ రికార్డు చేస్తున్నారు.
ALSO READ : 'వారణాసి'తర్వాత సూపర్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్..
రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ..
1978లో 'గమన్' సినిమాతో మొదలైన ఆయన నట ప్రస్థానం 'పరింద', 'క్రాంతివీర్','అబ్ తక్ ఛప్పన్' వంటి ఐకానిక్ చిత్రాలతో ముగిసింది. ఐదు దశాబ్దాల పాటు తనదైన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఆవేశపూరిత నటనతో అలరించిన నాle పటేకర్ భౌతికకాయాన్ని పుణే సమీపంలోని దోంజే ఫామ్‌హౌస్‌కు తరలించి, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
తండ్రికి వీడ్కోలు పలుకుతూ కుమారుడు మల్హర్ పటేకర్ భావోద్వేగానికి లోనయ్యారు.. నానా సాహెబ్ లాంటి గొప్ప వ్యక్తి ఎప్పటికీ మనల్ని వదిలిపోరు. ఆయన సాధించిన విజయాలు ఆయనను అమరుడిని చేశాయి. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మేం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
