బాన్సువాడ, వెలుగు: వర్షంలో స్కూటీ అదుపు తప్పి పడిపోగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన జల్సాని కిశోర్ గుప్తా( 43) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి వర్షం పడుతుండగా 11 గంటల సమయంలో కిశోర్ తన ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి వెళుతున్నాడు.
బోధన్ రోడ్ లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద స్కూటీ అదుపుతప్పి కిశోర్ కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
