ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటుపరం చేసేలా ఉన్న జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా, వాటి ఆస్తులు, విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కోరుతూ సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టింది.
ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకు వెళ్తున్న విద్యార్థులను ఇందిరాపార్క్ సిగ్నల్ వద్ద అదుపులోకి తీసుకుని దోమలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ ధర్నాచౌక్‌లో నిరసనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా ఎస్‌బీటీఈటీని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
