హైదరాబాద్సిటీ, వెలుగు: రైల్వే సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలని, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నతాధికారులకు సూచించారు. దీనివల్ల భద్రతా ప్రమాణాలు, రూల్స్, మెయింటనెన్స్పై అవగాహన పెరుగుతుందన్నారు.
సోమవారం రైల్ నిలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. జోన్ వ్యాప్తంగా కొనసాగుతున్న వివిధ పనుల స్థితిని, స్టేషన్లు, రైళ్లలో, గూడ్స్ షెడ్లలో, ఇంటర్‌లాకింగ్ లేని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పరిస్థితిని సమీక్షించారు. దక్షిణ మధ్య రైల్వే అడిషనల్జీఎం.సత్యప్రకాశ్, వివిధ శాఖల ప్రధాన అధిపతులు హాజరయ్యారు.
