వేతన బకాయిల కోసం బీఎల్‌వోల ఆందోళన

వేతన బకాయిల కోసం బీఎల్‌వోల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: వేతన బకాయిల కోసం బీఎల్‌వోలు సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. రెండేండ్లుగా పూర్తి వేతనం ఇవ్వడం లేదని, నెలకు రూ.6 వేలకు బదులు రూ.5,500 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ఎన్నికల విభాగం నుంచి నిధులు విడుదలైనప్పటికీ ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు నిలిపివేశారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.