ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు సీసాలను ఆదిలాబాద్రూరల్ మండలం భీంసరికి తరలిస్తున్న వ్యక్తిని టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ కె.నాగరాజు వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారులో తనిఖీలు చేపట్టి అందులో 13 బాక్సుల్లో ఉన్న 1300 దేశీదారు సీసాలను గుర్తించారు.
వాటి విలువ రూ.1,28,700- ఉంటుందని తెలిపారు. మద్యం తరలిస్తున్న నిందితుడు సిర్పురే జనార్ధన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. మద్యం అమ్మిన మహారాష్ట్రకు చెందిన గజానన్ రాములు బట్టిన్వార్ అలియాస్ గజ్జుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సైలు అఖిల్, ప్రణయ్, సిబ్బంది పాల్గొన్నారు.
