రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొడిమ్యాల/మల్యాల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్​లో కొద్దిరోజుల క్రితం కుక్కల దాడిలో 30 గొర్లు కోల్పోయిన యజమానులకు శనివారం ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేశారు. గొర్ల కాపరి పర్వతాలకు, రూ.30వేలు, లచ్చవ్వకు రూ.15 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారి ప్రకాశ్, ఎంపీడీవో స్వరూప, నాయకులు నాగభూషణం రెడ్డి, రాజ నర్సింగ రావు, సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్​లో ఎమ్మెల్యే సత్యం పర్యటించారు. రజక, మాల కుల సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ స్కూల్​లో నిర్మించిన వంట గదిని ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షులు సతీశ్ రెడ్డి, గంగాధర్, సర్పంచులు కుమార్, ఆదిరెడ్డి, శ్రీను, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.