కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వివిధ విభాగాల్లో మొత్తం 51 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 51.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్–డి 01, సైంటిస్ట్–సి 08, సైంటిస్ట్–బి 12, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) 03, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 01, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్ఏ) 13, ట్యాక్సానమిస్ట్ 01, డేటా ఎంట్రీ ఆపరేటర్ 04, ఫీల్డ్ అసిస్టెంట్ 08.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: సైంటిస్ట్–డి 50 ఏళ్లు, సైంటిస్ట్–సి 45 ఏళ్లు, సైంటిస్ట్–బి, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్ఏ), ట్యాక్సానమిస్ట్ 35 ఏళ్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 32 ఏళ్లు, ఫీల్డ్ అసిస్టెంట్ 27 ఏళ్లు. వయోపరిమితిలో ఏ వర్గాలకు సడలింపు ఉండదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 24 నుండి.... ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 07.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.cpcb.gov.inను సందర్శించండి.
