- రేపు ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట ధర్నా
జైనూర్, వెలుగు: ఆదివాసీ ఏజెన్సీ ప్రాంత సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని తుడుం దెబ్బ కుమ్రం భీం జిల్లా అధ్యక్షుడు గేడం గోపిచంద్ కోరారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట నిర్వహించనున్న ధర్నా పోస్టర్లను శనివారం జైనూర్లో ఆవిష్కరించి మాట్లాడారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంత యువతకు గతంలో ఉన్న 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్లపై తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు భారీ ఎత్తును పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
