- ముగిసిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు
- తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో ఓటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీపాల) నూతన అధ్యక్షుడిగా బి. శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. శనివారం ఆన్‌లైన్ విధానంలో అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. దీనిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీజీ పాల అసోసియేట్ ప్రెసిడెంట్‌గా విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీగా రాజేందర్ కొరుట్ల, ట్రెజరర్‌గా పదవాల ఆనంద్ ఎన్నికయ్యారు.
వైస్ ప్రెసిడెంట్లుగా ఎం.రవి(అకాడమిక్), పి.అజయ్ కుమార్ (సర్వీసెస్), పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీగా చినెన్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె. శ్రీనివాస్, మహిళా సెక్రటరీగా బి.కృష్ణవేణి ఎలెక్ట్ అయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా దీపికా రెడ్డి (సర్వీసెస్), కె. రాజ్ కుమార్ (అకాడమిక్), సురేశ్ మామిడిశెట్టి (కమ్యూనికేషన్స్), జోనల్ సెక్రటరీలుగా వేద్వ్రత్ (మల్టీ జోన్–1), అజయ్ గౌడ్ (మల్టీ జోన్–2) ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యత, పారదర్శకతతో టీజీపాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సభ్యులందరి ప్రయోజనాలను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు.
