హైదరాబాద్: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కానాల వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.ఫర్నిచర్ గోదాం కావడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. గోదాం చుట్టుపక్కల కూడా ఇతర గోదాంలు ఉండటంతో మంటలు వాటికి వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
