యూపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తుందని న్యాయం చేయాలని అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసును బయటపెట్టిన జర్నలిస్టు అభిషేక ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయోధ్యా రామాలయం విరాళాల చోరీ, యూపీలో జరిగిన అవినీతి ఆరోపణలను వెలికి తీసినందుకే తనను టార్గెట్ చేసి రోడ్డు రేజ్ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసులు పెట్టారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ లు జయామాల్య బాగ్చీ, మోహన్ లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించగా రేపు(ఆగస్టు 25న) ఈ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
రోడ్డు రేజ్ కేసులో జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ పై ఎస్సీ ఎస్టీ యాక్టు కింద కఠిన చర్యలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 20న అతని ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా తన కేసులువిచారించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు అభిషేక్ ఉపాధ్యాయ.కొన్ని షరతులకు లోబడి మంగళవారం ఈ కేసును విచారించేందుక సీజేఐ అంగీకరించారు.
అయోధ్య ఆలయం విరాళాల దుర్వినియోగంతో పాటు, 2023లో భదోహిలో సుమారు 20 కోట్ల వ్యవసాయ భూమికి కొనుగోలుకు సంబంధించి యూపీ సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారికి సంబంధించిన దర్యాప్తు రిపోర్టును కూడా ఉపాధ్యాయ్ పబ్లిష్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 18న తన వెహికల్ తో వెనకనుంచి ఢీకొట్టి వ్యక్తిని బెదిరించాడని ఆరోపిస్తూ ఓ బైకర్ చేసిన ఫిర్యాదులో ఉపాధ్యా్య్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. భారతీయ న్యాయ సంహిత మరియు ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ అభిషేక్ ఉపాధ్యాయ్ సోమవారం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
