మరో ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంత పెద్ద రాష్ట్రంలో ఇలాంటి హామీ రావటం చూస్తుంటే.. ఎన్నికల హామీల్లోకి సీఎం యోగీ దిగేసినట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో ఈ హామీతో మంచి రిజల్ట్స్ చూసిన తర్వాత.. అదే బాటలో యూపీలోనూ బీజేపీ ప్రభుత్వం వెళ్లటం చర్చనీయాంశం అయ్యింది.
మహిళలకు రాఖీ పండుగ కానుక ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 2026 ఆగస్టు 25 తేదీన సీఎం యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షతన సమావేశం అయిన కేబినెట్ 24 ముఖ్యమైన ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో 60 ఏండ్లకు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం. లోక్ మాతా అహిల్యబాయి మాతృశక్తి యోజన కింద.. మహిళలు జీవిత కాలం ఉచిత ప్రయాణం చేసే అవకావం కల్పిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో 60 ఏండ్లకు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలు ఈ స్కీమ్ తో లబ్ది పొందనున్నట్లు చెప్పారు. ఓటర్ ఐడీ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు.
