ఢిల్లీని షేక్ చేస్తున్న ఉల్లి.. వారం రోజుల్లో డబుల్ రేటు.. !

ఢిల్లీని షేక్ చేస్తున్న ఉల్లి.. వారం రోజుల్లో డబుల్ రేటు.. !

ఉల్లి.. ఉల్లి ధర దేశ రాజధానిని షేక్ చేస్తోంది. ఉల్లికి.. ఢిల్లీకి ఉన్న బంధం అలాంటి ఇలాంటిది కాదు. ఉల్లి ధరతో ప్రభుత్వాలే కూలిన చరిత్ర.. అలాంటిది ఇప్పుడు ఢిల్లీని మరోసారి షేక్ చేస్తోంది. నిన్నా మొన్నటి వరకు కంట్రోల్ లోనే ఉన్న ఉల్లి ధర.. వారం రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. ఆగస్ట్ 17వ తేదీన కిలో 35 రూపాయలుగా ఉన్న ధర.. ఇప్పుడు ఏకంగా డబుల్ అయ్యింది. రెట్టింపు అయిన ఉల్లి ధరలతో జనం బెంబేలు ఎత్తుతున్నారు. ఢిల్లీని షేక్ చేస్తున్న ఉల్లి వివరాలు ఇలా ఉన్నాయి.

నిన్న మొన్నటి వరకు ఉల్లి ధర వందకు 4 నుంచి 5 కిలోలు ధర పలికింది. ఇప్పుడు సగటున చిల్లర ధర కిలో 42 రూపాయలకు చేరుకున్నది. ఇది గతేడాదితో పోలిస్తే 45 శాతం ఎక్కువ. గత నెలతో పోలిస్తే 19 శాతం అధికం. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కిలో రూ.35 ఉన్న  ఉల్లి ధర ఇప్పుడు 65నుంచి 70 లకు చేరింది. టోకు మార్కెట్లో ఉల్లి ధర ఇంకా ఎక్కువగానే ఉంది. వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్టు18న ఉల్లిపాయల టోకు ధర క్వింటాల్ కు 2వేల 897 రూపాయలుగా ఉంది. ఇది వారం క్రితం కంటే 31 శాతం ఎక్కువ. నెలముందు ధరలతో  పోలిస్తే 43 శాతం , ఇక గతేడాదితో పోలిస్తే 118 శాతం అధికం. 

పండుగల సీజన్  సమీపిస్తున్న సమయంలో దేశంలో మరోసారి ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగి సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.  ఉల్లిపాయలే కాదు కూరగాయలు, చైనా దిగుమతుల ధరలు కూడా పెరగడంతో మరింత భారం పడుతున్నది. ఉల్లి పాయల వాడకం అధికం కావడంతో రాష్ట్రాల బఫర్ స్టాక్ ను బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయల ధరలు ఉన్నట్టుండి అకస్మా్త్తుగా  పెరగడంతో  సామాన్యులు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

ఉల్లిధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరిగాయ్..?

ఉల్లి దిగుబడి తగ్గడం, పాత నిల్వలు(బఫర్ స్టాక్ ) అయిపోవడం, పండుగ సీజన్ లో డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   

పాత రబీ పంట అయిపోవడం, ఖరీఫ్ పంట రావాల్సి ఉంది. మనదేశంలో మార్చి-ఏప్రిల్ నెలల్లో కోతకు వచ్చే రబీ ఉల్లి పంట, దేశానికి ప్రధాన నిల్వ పంటగా ఉన్నది. సాధారణంగా అక్టోబర్ వరకు దాదాపు ఏడు నెలల పాటు మార్కెట్‌కు సరఫరా చేస్తున్నది. కోల్డ్ స్టోరేజ్‌లో ఉల్లి నిల్వలు తగ్గుతున్న కొద్దీ మార్కెట్ తదుపరి పంట నుంచి వచ్చే తాజా సరఫరాపై ఎక్కువగా ఆధారపడుతున్నది. 

ఉల్లి ధరల పెరుగుదల: సరఫరాపై ప్రభావం..

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం..మార్చి, ఏప్రిల్ నెలల్లో నిల్వ చేసిన రబీ ఉల్లిపాయలే అక్టోబరు వరకు  సరఫరా అవుతున్నది. ఈలోగా అక్టోబరులో ఖరీఫ్ పంట  వచ్చేవరకు ఏర్పడే కొరతను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి  వచ్చే కొద్దిపాటి ఖరీఫ్ ఉల్లిపాయలు సర్దుతున్నవి. ఈ ఏడాది నిల్వ చేసిన ఉల్లి అయిపోతుండటంతో ఈ మార్పు ఇబ్బందికరంగా మారింది. నిల్వ చేసిన రబీ ఉల్లిపాయల నాణ్యత కూడా దెబ్బతినడంతో సమస్య మరింత పెరిగుతున్నది. 

ఖరీఫ్ పంటలో జాప్యం..!

ఉల్లి ధరలకు పెరగకుండా ఊరటనిచ్చేది ఖరీఫ్ పంట.. అయితే ఈసారి ఖరీఫ్ లో వచ్చే ఉల్లి పంట చాలా ఆలస్యమైనది. రిపోర్టుల ప్రకారం.. మహారాష్ట్రలో రుతుపవనాల రాక ఆలస్యంతో ఖరీఫ్ విత్తనాలు వేయడంలో జాప్యం అయ్యింది. దీనివల్ల నాసిక్ ప్రాంతం నుంచి ఖరీఫ్ పంట రాక ఆలస్యం అవుతున్నది. ఈలోగా దక్షిణ రాష్ట్రాల నుంచి సరఫరా మరింత కీలకంగా మారడంతో ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయి..?

ఉల్లి ధరలు తగ్గాలంటే ఖరీఫ్ పంట చేతికి వచ్చేదానిపై ఆధారపడి ఉన్నది. అక్టోబర్ నెల చివరి వరకు ఉల్లి ధరలు అధికంగానే కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఖరీఫ్ పంట రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున రాబోయే కొన్ని వారాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు.