హైదరాబాద్, వెలుగు: నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్(మాచూరి వెంకట సుబ్బారావు) ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అడ్మిషన్ల పేరుతో భారీ అక్రమాలకు పాల్పడుతోందని ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు.
2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీ-కేటగిరీ, సీ- కేటగిరీ (ఎన్ఆర్ఐ) సీట్ల భర్తీలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తుంగలోకి తొక్కి ఒక్కో సీటును రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు.
