కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మార్వాడీల కావడి యాత్ర

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మార్వాడీల కావడి యాత్ర

శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో కావడి యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 1,000 మంది మార్వాడీ పెద్దలు, మహిళలు, పిల్లలు కాషాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.

ప్రకృతికి కృతజ్ఞత తెలుపడమే ఈ యాత్ర లక్ష్యమని వారు పేర్కొన్నారు. సీఐ నాగార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాహిత్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్​శాఖ అధ్యక్షుడు జండగూడెం సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

షాద్ నగర్, వెలుగు