దేశవ్యాప్తంగా నీట్ యూజీ మొదటి రౌండ్–కౌన్సెలింగ్ ఫైనల్ రిజల్ట్ విడుదల

దేశవ్యాప్తంగా నీట్ యూజీ మొదటి రౌండ్–కౌన్సెలింగ్ ఫైనల్ రిజల్ట్ విడుదల
  •     విద్యార్థుల కోసం ఫ్రీజ్, ఫ్లోట్ ఆప్షన్లు అందుబాటులోకి 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) యూజీ కౌన్సెలింగ్-–2026  రౌండ్–1 ఫైనల్ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. రౌండ్–1లో సీట్లు పొందిన అభ్యర్థులందరూ వెంటనే తమకు అలాట్ అయిన సంబంధిత కాలేజీలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని  స్పష్టం చేసింది. 

కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యార్థులకు మరింత సులభతరం, సౌకర్యవంతంగా మార్చేందుకు యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాప్టర్–-2 నిబంధనల ప్రకారం.. ఈసారి ఫ్రీజ్, ఫ్లోట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎంసీసీ వివరించింది. అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనే ముందు విద్యార్థులందరూ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ www.mcc.nic.in ను మాత్రమే సందర్శించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కార్యాలయం వెల్లడించింది. సందేహాల కోసం adgme@nic.in ఈమెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.