హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆయా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఎ. శ్రీదేవసేన సోమవారం తెలిపారు.
27న కాలేజీల వారీగా, బ్రాంచీల వారీగా మిగిలిన ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. 28న ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇస్తాయని, 29న పత్రికల్లో ప్రకటనలు వస్తాయన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు అభ్యర్థులు నేరుగా ఆయా విద్యాసంస్థలకు వెళ్లి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
