వరద కాలువను ఆక్రమించి కట్టారు.. అంజయ్య నగర్లో మరికొన్ని డేంజరస్ భవనాలు కూల్చివేత

వరద కాలువను ఆక్రమించి కట్టారు.. అంజయ్య నగర్లో మరికొన్ని డేంజరస్ భవనాలు కూల్చివేత
  • ఆదివారం షురూ.. ఇంకా కొనసాగింపు
  • పరిశీలించిన హైడ్రా కమిషనర్
  • పక్కనే మరికొన్ని డేంజరస్​ భవనాలు 
  • పరిశీలించి కూల్చేస్తామన్న రంగనాథ్​

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి అంజయ్యనగర్​లో కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో బిల్డింగ్​కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం మొదలైన పనులు అర్ధరాత్రి వరకూ నడవగా, డిస్ట్రబెన్స్​గా ఉందని స్థానికులు చెప్పడంతో ఆపేశారు. మళ్లీ సోమవారం ఉదయం మొదలుపెట్టారు. బిల్డింగ్ ​చుట్టూ అపార్ట్​మెంట్లు, ఇతర బిల్డింగులు ఉండడంతో శిథిలాలు వాటి మీద పడకుండా హైడ్రా జాగ్రత్తగా కూలుస్తోంది.

వరద కాలువను ఆక్రమించి కట్టారు
కూల్చివేత పనులను సోమవారం హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి జోనల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన బిల్డింగు పక్కన పక్కనే మరికొన్ని భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లడంతో పరిశీలించి, అవసరమైతే తొలగిస్తామని ప్రకటించారు.

హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. కొంతమేర వరద కాలువను ఆక్రమించి 50 గజాల స్థలాల్లో ఏడెనిమిది అంతస్తులు కట్టడం వల్ల పటిష్టత దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు.  రెండతస్తులకే పర్మిషన్లు తీసుకుని ఆ మేరకే పిల్లర్లు, పునాదులు వేసి ఆపై ఏడంతస్తుల వరకు కట్టడంతో భవనాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 

మృతుల కుటుంబాలను ఆదుకోండి 
అంజయ్యనగర్​లో జరిగిన ఘటనలో అందులో టైల్స్​పనులు చేసే కూలీలైన మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మూడేండ్ల క్రితం వీరిద్దరూ పొట్టకూటి కోసం కుటుంబాలతో కలిసి సిటీకి వచ్చారు. ఉమేశ్ ​మణికొండలో, మోహపాల్​ కొండాపూర్​లో ఉంటున్నారు. 

ఈ ఇద్దరి మరణంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తేకానీ పూటగడవని ఆ కుటుంబాలకు అధికారులు గానీ, ప్రభుత్వం గానీ సాయమందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

శంషాబాద్లో బిల్డర్ ​అరెస్ట్..
కుప్పకూలిన బిల్డింగ్​ను కడుతున్న అంజయ్యనగర్కు చెందిన బిల్డర్​సయ్యద్​ సాజిద్ దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా శంషాబాద్​వద్ద అరెస్ట్​చేశామని రాయదుర్గం పోలీసులు ప్రకటించారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్​ ఖాజా మొయినుద్దీన్​కోసం స్పెషల్​టీమ్స్తో గాలిస్తున్నారు.