రాఖీ పండుగ : భర్తకూ రాఖీ కట్టే సంప్రదాయం పురాణాల్లో ఉందని ఎంత మందికి తెలుసు..!

రాఖీ పండుగ : భర్తకూ రాఖీ కట్టే సంప్రదాయం పురాణాల్లో ఉందని ఎంత మందికి తెలుసు..!

రాఖీ పండుగ .. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.. అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు.. గొప్పగా జరుపుకునే పండుగ.  రాఖీ పండుగ రోజు ( ఆగస్టు 28) సోదరుడికి.. సోదరీ మణులు రాఖీ కడతారు.  ఇంకా ఎలాంటి రిలేషన్​ కలిగిన వారు రాఖీ కట్టుకోవచ్చు.. భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా.. పురాణాల్లో ఏముంది.. దేవతలు ఎవరెవరు రాఖీ కట్టుకున్నారు..  మొదలగు విషయాల గురించి  ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

భార్య .. భర్తకు రాఖీ కట్టవచ్చా?


రాఖీ అంటే రక్షగా ఉంటామని  ఇచ్చే వాగ్దానం. ఎటువంటి పరిస్థితులు ఎవరైనా రాఖీ కట్టిన వారికి అండగా నిలబడి వారిని ఎల్లవేళలా రక్షించాలి.  భార్య తన భర్తకు (రాఖీ) రక్షాబంధనం  కట్టే సాంప్రదాయం పురాణాల్లో ఉంది. . 

ఇంద్రుడికి రాఖీ కట్టిన భార్య ఇంద్రాణి

వేదకాలంలో రాక్షసులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరిగింది. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో ఇంద్రుడు ఆందోళనలో పడతాడు. రాక్షసులు యుద్ధంలో గెలిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచిస్తూ భయపడిన ఇంద్రుడు తన గురువు ‘బృహస్పతి’ని సలహా అడిగాడు. ఇంద్రుడి భార్య ఇంద్రాణితో అతని మణికట్టుపై (రాఖీ ) రక్ష సూత్రం కట్టమని బృహస్పతి సూచిస్తాడు. అతని సలహాతో ఇంద్రాణి శ్రావణ పౌర్ణమినాడు ఇంద్రుడి మణికట్టుకు రాఖీ కట్టింది. ఆమె రక్షగా కట్టిన దారం ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే యుద్ధంలో దేవతల విజయానికి దోహదపడింది..

భర్త దేవేంద్రడుకి రక్ష బంధన్ కట్టిన భార్య శచీదేవి..

 స్వర్గలోకాధి పతి దేవేంద్రడు రాజ్యమైన అమరావతిని, బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి, తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు, బలి మీదకు యుద్ధానికి బయల్దేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ… ఇంద్రుని భార్య శచీదేవి, విష్ణుమూర్తిని వేడుకొంది. అంతట విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు. శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడు.

విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షా బందన్..

రక్షా బంధన్ అనేది కేవలం సోదర సోదరీ మణులకే కాదు భార్యా భర్తల మద్య కూడా ఉందని తెలుస్తోంది. యుద్ధానికి వెళ్లే భర్తలకు, భార్యలు వీరతిలకాన్ని అద్ది, రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు. కానీ రక్షా బంధన్ అనేది బంధాలకే కాదు రక్షకు గుర్తు అని చెప్పకనే చెబుతోంది. అది భర్తకు..  భార్య కట్టిన సోదరులకు ..సోదరీమణులు కట్టినా రక్షా బంధన్ అనేది రక్షకు గుర్తు అని మాత్రం నిదర్శనంగా కనిపిస్తోంది.

రక్షా బంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైనా కానీ ఈ సంప్రదాయాన్ని కలియుగంలో కూడా ఆచరిస్తున్నారు.  రాఖీ పండుగ ఇప్పటికీ బంధాలను బలోపేతం చేస్తూనే ఉంది. పురుషుడు లేదా స్త్రీ, పట్టింపు లేదు.. ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడు.. మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికి తెలియని రహస్యం కావచ్చు. కానీ రక్షాబంధన్ ఓ సంతోష సంబరం. పండుగ ఏదైతేనేమి పదిమంది కుటుంబ సభ్యులు కలిస్తే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లవుతుందికదా..!