రాఖీ పండుగ : పురాణాల్లో ఎవరు ఎవరికి రాఖీ కట్టారు.. లక్ష్మీదేవి, ద్రౌపది ఎవరికి రక్ష బంధం కట్టారు..!

రాఖీ పండుగ : పురాణాల్లో ఎవరు ఎవరికి రాఖీ కట్టారు.. లక్ష్మీదేవి, ద్రౌపది ఎవరికి రక్ష బంధం కట్టారు..!

రాఖీ పండుగ గురించి  పురాణాల్లో కొన్ని కథలున్నాయి.  భాగవతం.. భవిష్యపురాణంలో  కూడా కొన్ని కీలకఘట్టాలున్నాయని పండితులు చెబుతున్నాయి. మహాభారత యుద్దంలో జరిగిన ఓ సంఘటన నుంచి రాఖీ పండుగ పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఆ తరువాత దేవుళ్లు కూడా రక్షాబంధనాన్ని జరుపుకున్నారని పండితులు చెబుతున్నారు.  వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బలి చక్రవర్తికి...  లక్ష్మీదేవి 

మహా పరాక్రమశాలి..దానాలకు మారు పేరుగా నిలిచిన బలి చక్రవర్తికి సాక్షాత్తు ఆదిదేవుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రక్షా బంధన్ కట్టిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకానొక సందర్భంగా రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి.. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో తెలిపిందట. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందట.

సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తనను సోదరుడిగా భావించి కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా బలి చక్రవర్తి. పైగా దానంలో ఆయన శిభి చక్రవర్తిలాంటివాడు. ఇచ్చిన మాట కోసం తన రక్త మాంసాలనే కోసి ఇచ్చిన మహా దాత శిభి చక్రవర్తి. అంతటి శిభి చక్రవర్తితో సమానుడైన బలి చక్రవర్తి సాక్షాత్తు ఆ నారాయణుడే తన వద్దకు వచ్చి దేహీ అని అడిగితే దానం ఇచ్చిన గొప్ప రాక్షస చక్రవర్తి. అటువంటి బలి వద్దకు ఆ లక్ష్మీదేవి స్వయంగా వెళ్లి రక్ష కట్టి కోరితే ఇవ్వకుండా ఉంటాడా..? అలా బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.. ఇలా విభిన్న రకాలుగా ‘రాఖీ పౌర్ణమి’ పుట్టిందని చెపుతారు.

శ్రీకృష్ణుడుకి ... ద్రౌపది 

భారతంలో శ్రీకృష్ణుడు లేని ఘట్టాలు చాలా అరుదుగా ఉంటాయి. పాండవులకు రక్షణ కవచంలా నిలిబడిన శ్రీకృష్ణుడు పాండవుల పత్ని ద్రౌపదికి తోడబుట్టినవాడు కాకున్నా ఆమెను అనుక్షణం కాపాడాడు. నిండు సభలో వివస్త్ర కాకుండా ఆమె మానప్రాణాలు కాపాడిన దేవుడు శ్రీకృష్ణుడు. దీని వెనుక ఓ కారణం ఉంది.

దుష్ణ శిక్షణకు ఆవతరించిన దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడు దుర్మార్గాలు చేసే ఛేది రాజ్య చక్రవర్తి అయిన శిశుపాలుడుని సంహరించాలనుకుంటాడు. కృష్ణుడికి మేనత్త అయిన శ్రుతాదేవి కుమారుడే శిశుపాలుడు. అయినా ధర్మం కోసం దుర్మార్గాన్ని అణచటం కోసం కృష్ణుడు సొంత బంధువునే సంహరించటానికి వెనుకాడడు. మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అయ్యేవరకు ఆగాలనుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు శిశుపాలిడ్ని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అలా సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు చేతికి గాయమవుతుంది. దీంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి గాయానికి కట్టుకడుతుంది.  అయితే ఈ వృత్తాతం అంతా శ్రావణ పౌర్ణమి రోజున జరిగిందని  కృష్ణ పురాణంలో పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  

►ALSO READ | చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల వారికి జరిగేది ఇదే..!

దాంతో కృష్ణుడు సంతోషపడి..నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అంటూ అభయమిస్తాడు. అలా కృష్ణుడు ఇచ్చిన మాటను ద్రౌపది అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. తరువాతి కాలంలో కురు సభలో పాండవులు జూదంలో ఓడిపోవటం..ఆ జూదంలో ద్రౌపదిని కూడా పందెంగా పెట్టటం .... దుర్యోధనుడు ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగి వివస్త్రను చేసే సమయంలో ద్రౌపది వేడుకోలుతో అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు.అలా వీరిద్దరు తోడబుట్టినవారు కాకపోయినా..అన్నగా భావించి రక్షణణు కట్టిన ద్రౌపది..చెల్లెలిని కాపాడిన అన్నగా శ్రీకృష్ణుడు ఘట్టాలు రక్షాబంధన్ కు మూలం అని అంటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.