ఈపీఎఫ్‌ఓ అలర్ట్.. ఉద్యోగులకు PF పెన్షన్ రావాలంటే ఈ రూల్ ఫాలో అవ్వటం తప్పనిసరి!

ఈపీఎఫ్‌ఓ అలర్ట్.. ఉద్యోగులకు PF పెన్షన్ రావాలంటే ఈ రూల్ ఫాలో అవ్వటం తప్పనిసరి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) ఈపీఎఫ్ సభ్యులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ పిన్షన్ పొందాలంటే సభ్యులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ రూల్ పాటించని వారు భవిష్యత్తులో పిన్షన్ ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అర్హులైన సభ్యులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

PF నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే విషయమై ఈపీఎఫ్‌వో సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయి సలహాలు, సూచనలను అందించింది. 10 ఏళ్ల కాలపరిమితి పూర్తి కాకముందే పీఎఫ్ ఖాతా నుంచి మధ్యలో డబ్బులు డ్రా చేస్తే సర్వీస్ పీరియడ్ లెక్క మారుతుందని హెచ్చరించింది. ఈ కారణంగా రిటైర్మెంట్ సమయంలో అందాల్సిన నెలవారీ పిన్షన్ అర్హతను సభ్యులు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి సర్వీస్ కాలం పూర్తి కాకుండా ముందస్తుగా డబ్బులు తీయడం వల్ల కలిగే నష్టాలపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది.

ఈ 10 ఏళ్ల సర్వీస్ నిబంధన ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న అవసరాల కోసం కూడా పీఎఫ్ డబ్బులను మధ్యలోనే వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అర్హత కాలం దెబ్బతినకుండా ఉండేందుకు సభ్యులు తమ ఖాతా నియమాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. సరైన ప్లానింగ్ లేకుండా పీఎఫ్ డబ్బులు ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర నిరాశకు గురిచేసే అవకాశం ఉంది.

ఈపీఎఫ్‌ఓ చేసిన ఈ తాజా ప్రకటన సభ్యులు తమ రిటైర్మెంట్ ప్లానింగ్‌ను సరిగ్గా మలచుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగ జీవితంలో ఎటువంటి బ్రేకులు లేకుండా కంటిన్యూగా 10 ఏళ్ల పాటు కాంట్రిబ్యూషన్స్ ఉండేలా చూసుకోవాలి. పీఎఫ్ విత్‌డ్రాయల్స్ విషయంలో ముందస్తు వ్యూహం లేకపోతే రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఆర్థిక భరోసా గల్లంతవుతుంది. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్ప పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసే సాహసం చేయకపోవడమే ఉత్తమం.

మొత్తంగా చూస్తే.. ఈపీఎఫ్ సభ్యులు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. చిన్న చిన్న అవసరాల కోసం పీఎఫ్ నిధులను ఖర్చు చేయడం కంటే.. పెన్షన్ అర్హతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రూల్స్ అర్థం చేసుకుని వాటిని పాటించాలని ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరించింది ఎక్స్ వేదికగా పోస్టులో.