Toxic Bookings: రిలీజ్‌కు ఇంకా 24 గంటలే.. ‘టాక్సిక్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలే! దిల్ రాజు ఆలస్యానికి కారణం ఇదేనా?

Toxic Bookings: రిలీజ్‌కు ఇంకా 24 గంటలే.. ‘టాక్సిక్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలే! దిల్ రాజు ఆలస్యానికి కారణం ఇదేనా?

‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి కేవలం 24 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. అయినప్పటికీ, హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఇంకా టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న గ్రాండ్‌గా తెరపైకి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (GO) కోసం ఎదురుచూస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి.

ఈ జీఓ రాగానే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని స్పష్టమౌతోంది. ధరల పెంపుపై క్లారిటీ రాగానే బుకింగ్ గేట్లు తెరుచుకుంటాయని సినీ వర్గాల టాక్. అయితే, ఇలా ఆఖరి నిమిషం వరకు కూడా బుకింగ్స్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్‌లో అసహనం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్, మరియు సినిమా ఫస్ట్ టాక్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  

భారీ క్రేజ్ ఉన్న ఇలాంటి పాన్-ఇండియా చిత్రానికి లాస్ట్-మినిట్ కన్ఫ్యూజన్ మేకర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ భారీ కంబ్యాక్ ఫిల్మ్ ఇది. బ్లాక్‌బస్టర్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' విజయం సాధించిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత యష్ సిల్వర్ స్క్రీన్‌పైకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు.

డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో డార్క్, స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణీ వసంత్ తదితరులు పవర్-ప్యాక్డ్ స్టార్స్ అలరించనున్నారు.