మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ (I, Nobody). ఇవాళ (ఆగస్టు 25, 2026న) ఒకే సారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కి వచ్చింది. ‘రోర్‌షాక్’ (Rorschach) ఫేమ్ నిసామ్ బషీర్ డైరెక్ట్ చేసిన డార్క్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్తో పాటుగా సింప్లీసౌత్ ప్లాట్‌ఫామ్‌లలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జులై 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, స్రవంతి మూవీస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఉత్కంఠను కొనసాగిస్తోంది.
I, Nobody is now streaming exclusively on JioHotstar in Malayalam, Tamil, Kannada, Telugu, and Hindi.@prithviofficial @parvatweets @PrithvirajProd#INobody #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama #MalayalamMovie pic.twitter.com/ZHpPJ4U1ri
— JioHotstar Malayalam (@JioHotstarMal) August 24, 2026
కథేంటంటే..
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ రాజీవన్ అనే సాధారణ వ్యక్తి పాత్రలో కనిపించారు. భార్య, కూతురితో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అతని జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఏకంగా రూ.17 కోట్ల భారీ బ్యాంక్ దోపిడీ కేసులో రాజీవన్ ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే ఊహించని పరిణామాలు కథను ఉత్కంఠగా మారుస్తాయి. అయితే అసలు ఆ దోపిడీ చేసింది రాజీవనేనా? లేక అతడిని ఎవరో కావాలనే ఈ కేసులో ఇరికించారా? తనపై పడిన నేరారోపణల నుంచి బయటపడేందుకు రాజీవన్ చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
►ALSO READ | ఆచంట మహేష్ శివాలయం మూవీ షూటింగ్ షురూ
హైలైట్స్..
పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇంటెన్స్ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా పార్వతి తిరువోతు మెప్పించారు. ‘ఇరుముడి పాప’ ఫేమ్ నక్షత్ర కూడా ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. సమీర్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దర్శకుడు నిసామ్ బషీర్ తనదైన టేకింగ్‌తో కథను ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసేలా ట్విస్టులను డిజైన్ చేయడం సినిమాకు ప్లస్‌గా మారింది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ వాతావరణాన్ని మరింత బలపరిచాయి. కీలక సన్నివేశాల్లో BGM సినిమాకు మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది.
പപ്പയുടെ കൂടെ അടികൂടാൻ വന്നവരാരും ഇന്ന് ജീവിച്ചിരിപ്പില്ല.
— JioHotstar Malayalam (@JioHotstarMal) August 25, 2026
I, Nobody is streaming now exclusively on JioHotstar in Malayalam, Tamil, Kannada, Telugu, and Hindi.@prithviofficial @parvatweets @PrithvirajProd#INobody #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama… pic.twitter.com/YzzlxOW7Mv
థ్రిల్లర్ ఆడియన్స్కు బెస్ట్ ఛాయిస్..
క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి ‘ఐ, నోబడీ’ మంచి ఓటీటీ వాచ్‌గా నిలిచే అవకాశముంది. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, కథలోని మలుపులు, ఇంటెన్స్ టేకింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
