టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తేజ సజ్జా పుట్టినరోజు (బర్త్‌డే) సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ట్రెండ్ సెట్ చేసిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జాంబీ రెడ్డి 2 - నెక్స్ట్ లెవెల్’ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా.. సుపర్న్ ఎస్. వర్మ ఈ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సీక్వెల్‌లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మరియు అందాల తార షనయా కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
#TejaSajjaPMF2 is #ZombieReddy2 - NXT LVL.🤘🏻
— People Media Factory (@peoplemediafcy) August 23, 2026
TITLE ANNOUNCEMENT VIDEO OUT NOW 🔥
-- https://t.co/fZmcN8dzoe
Welcoming you all back to the ZOMBIE-VERSE 🧟♂️
This time, it’s BIGGER, BADDER & BLOODIER 💥
Happy Birthday, Superhero @tejasajja123 ❤️🔥
NXT LVL — DEAD OR ALIVE. 2027 😎… pic.twitter.com/xyre8pZYX1
టెర్రిఫిక్ గ్లింప్స్:
రాయలసీమ జానపద గీతానికి అనుగుణంగా రూపొందించిన ఈ చిత్ర యానిమేటెడ్ టైటిల్ గ్లింప్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండి, సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఫోక్ సింగర్ నాగవ్వ గొంతుతో పాడే పాట ఇంట్రెస్టింగ్ గా ఉంది. గౌర హరి మ్యూజిక్ క్యూరియాసిటీ కలిగిస్తుంది. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ విడుదల!
స్టోరీ బ్యాక్ డ్రాప్:
మొదటి భాగంలో రాయలసీమ నేపథ్యంలో సాగిన కథను.. ఈసారి ఏకంగా హైదరాబాద్ నగరానికి మార్చారు. ఒరిజినల్ చిత్రం కంటే మరింత పెద్దదిగా, సాహసోపేతంగా మరియు సరికొత్త రక్తపాతంతో కూడిన భీకరమైన జాంబీ ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నట్లు మేకర్స్ గ్లింప్స్ ద్వారా స్పష్టం ఇచ్చారు.
ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ మరియు జపనీస్ భాషల్లో ఏకంగా బహుభాషా (పాన్ ఇండియా & గ్లోబల్) చిత్రంగా 2027లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంతో టాలీవుడ్‌లో జాంబీ జోనర్‌కు సరికొత్త ఊపిరి పోసిన ఈ టీమ్, సీక్వెల్‌తో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి!
