Vastu tips: బెడ్ రూం వాస్తు ఇలా ఉండాలి.. అప్పుడే హాయిగా .. ప్రశాంతంగా నిద్రపోతారు..!

Vastu tips:   బెడ్ రూం వాస్తు ఇలా ఉండాలి.. అప్పుడే హాయిగా .. ప్రశాంతంగా నిద్రపోతారు..!

చాలామంది శారీరకంగా చాలా కష్టపడినా కాని అస్సలు నిద్ర పట్టదు.  దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.  అలాంటి వారు బెడ్​ రూంలో వాస్తున్న ప్రకారం చిన్న చిన్న మార్పులు చేస్తే హాయిగా .. ప్రశాంతంగా నిద్రపోతారని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.  .!

వాస్తు సిద్దాంతం మన లైఫ్​ స్టైల్లో కీలక పాత్ర పోషిస్తుంది.  ఇంట్లో సానుకూల శక్తి ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం. నెగిటివ్​ ఎనర్జీ ఉందా.. ఎంత సంపాదించినా... ఎంత ఉన్నత స్థితిలో ఉన్న ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.  

దీంతో నిద్ర పట్టక.. మానసిక ప్రశాంతత లేక ఆ కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో మంచాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. అలా పాటించిన వారు ఎన్ని ఇబ్బందులున్నా.. ఎంతటి కష్టం ఉన్నా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. 

వాస్తు పండితులు తెలిపిన వివరాల ప్రకారం..  తలుపుకు ఎదురుగా మంచం అస్సలు ఉండకూడదు.  అలాంటి మంచంపై నిద్రపోవడం వలన నెగిటివ్​ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.  ఇంట్లో ఉన్న సానుకూల శక్తి వెంటనే బయటకు వెళ్లి పోవడం వలన ఇబ్బందులు.. కష్టాలు ప్రారంభమవుతాయి.

  అంతేకాదు  ఇలా తలుపునకు ఎదురుగా పడుకోవడం అశుభంగా పరిగణించేవారు.  పూర్వకాలంలో మరణించిన వ్యక్తులను తలుపునకు ఎదురుగా ఉంచేవారని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కూడా కట్టెలపై మృతదేహాన్ని ఉంచే టప్పుడు ఇంటి గుమ్మం ఎదురుగా ఉంచే ఆచారం ఉంది. 

వాస్తు ప్రకారం నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నిద్రపోయేటప్పుడు సరైన దిశలోనే నిద్రపోవాలి. లేకపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. తలను తప్పు దిశలో పెట్టి నిద్రపోవడం వలన మానసిక ఆందోళన, నిద్రలో ఆటంకాలు, ప్రతికూల భావాలు కలుగుతాయి. కాబట్టి బెడ్‌రూమ్‌లో నిద్రపోయేటప్పుడు మంచాన్ని సరైన దిశలో ఉంచాలి. తలను కూడా సరైన దిశలో ఉంచాలి.

  • తూర్పు దిశ :   తల తూర్పు వైపు పెడితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచిది.
  • ఉత్తర దిశ: తల ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు, మానసిక ఆందోళనకు మరియు నిద్రలేమికి దారితీస్తుంది
  • దక్షిణ దిశ : తల దక్షిణం వైపు, కాళ్లు ఉత్తరం వైపు ఉండాలి. ఇది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ..ప్రశాంతమైన నిద్రకు చాలా మంచిది.
  • పడమర దిశ : తల పడమర వైపు పెట్టి నిద్రించడం వ్యాపారవేత్తలకు, కెరీర్​లో ముందుకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

సాయంత్రం వేళ నిద్రపోకూడదు

చాలామంది సాయంత్రం వేళల్లో నిద్రపోతారు. సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవి సంచరిస్తుంది.  ఆ సమయంలో నిద్రపోయే వారి ఇంటి వద్దకు రాగానే నిద్రా వస్థలో ఉన్న వారిని చూసి ఆగ్రహించి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.  అందువలన  సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేయడం వలన ఇంట్లో ధనం, ఆహారానికి కొరత ఏర్పడుతుంది.ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దని వాస్తు పండితులు సూచిస్తున్నారు.  సమయానికి నిద్రపోవాలి, ఉదయాన్నే మేల్కొనాలి. అదే మంచి అలవాటు. దాని వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.  

సానుకూల వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి

బెడ్‌రూమ్‌ చిందర వందరగా ఉండకూడదు.  బట్టలను క్రమ పద్దతిలో నీట్​గా సర్దుకోవాలి. డ్రెస్సింగ్​ టేబుల్​ ను  శుభ్రంగా ఉంచాలి. మంచం చుట్టూ తగినంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. గదిలో సులువుగా కదలడానికి వీలుగా ఉండేటట్టు బెడ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్​ రూం ఇలా ఉంటే ప్రశాంతంగా.. హాయిగా..  మంచి నిద్ర కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు,  నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.