కీవ్: దేశంపై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, మార్షల్ లా కింద ఎన్నికల ప్రక్రియను ఆపేశామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో ఎన్నికలంటే.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే సునామీయేనని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇలాంటి యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అంటే చేజేతులా దేశాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకోవడమే’ అని చెప్పారు. దేశంలో ఎన్నికల నిర్వహణకు రక్షణ శాఖ మాజీ మంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
