ఇందిరమ్మ ఇండ్ల పథకంలో.. హైదరాబాద్లో మరో 1,920 ప్లాట్లను.. కట్టాలని సర్కారు నిర్ణయం

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో.. హైదరాబాద్లో మరో 1,920 ప్లాట్లను.. కట్టాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సిటీలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో 1,920 ప్లాట్లను కట్టాలని సర్కారు నిర్ణయించింది. ఎల్బీనగర్‌‌‌‌లోని అమ్మగూడ, ముషీరాబాద్ లోని జమిస్తాన్ పూర్, చాంద్రాయణగుట్టలోని ఫలక్ నుమా, గోషామహల్‌‌ సెగ్మెంట్ లోని నాంపల్లిలో టవర్లు కట్టి, 480 చొప్పున ఫ్లాట్లు నిర్మించనున్నారు.

ఈ ప్రాంతాల్లోని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 3 వరకు అవకాశం కల్పించారు. మీ-సేవ కేంద్రాలు, వాట్సాప్  సేవలను ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు tghb.cgg.gov.in వెబ్‌‌సైట్‌‌ లేదా 040-24603572 నంబర్‌‌లో సంప్రదించాని అధికారులు సూచించారు.