కుర్రోడి వయస్సు పట్టుమని 25 ఏళ్లు.. చేసేదేమో ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజీలు. కానీ సంపాదన చూస్తే ఏకంగా కోటీ అరవై లక్షల రూపాయలు. టైర్-2 సిటీ నుంచి వచ్చి సోషల్ మీడియా మేజిక్‌తో కోట్లకు పడగలెత్తిన ఈ క్రేజీ స్టోరీ ఇప్పుడు రెడిట్ వేదికగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
మీమ్స్‌తో మొదలై కోట్లకు చేరిన ప్రయాణం..
కేవలం 18 ఏళ్ల వయసులో ఫ్రీలాన్సింగ్‌తో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్ పేజీలు, డిజిటల్ మీడియా బిజినెస్‌ను నడిపి ఈ స్థాయికి వచ్చాను. నా దగ్గర ఇప్పుడు రూ.85 లక్షల ఇండియన్ ఈక్విటీలు, రూ.7.5 లక్షల అమెరికన్ స్టాక్స్, రూ.5 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల రూపంలో రూ. 7 లక్షలు, రియల్ ఎస్టేట్‌లో రూ.15 లక్షలు, క్రిప్టోలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టానని ఈ కుర్రోడు చెబుతున్నాడు. ఇవన్నీ పోను ఏకంగా రూ.45 లక్షలు తన బ్యాంకు ఖాతాలో క్యాష్ రూపంలో అలాగే పడి ఉన్నాయట.
ఇప్పుడేం చేయాలి?
జీవితంలో ఇదొక పెద్ద మైలురాయే కావొచ్చు.. కానీ అసలు సమస్య ఇప్పుడు మొదలైంది అంటున్నాడు కుర్రోడు. ఏప్రిల్ నుంచి బ్యాంకు అకౌంట్‌లో పడి ఉన్న ఆ రూ.40-45 లక్షలను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తనకు అస్సలు అర్థం కావడం లేదట. తన బిజినెస్ ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు, హెచ్చుతగ్గులు సహజం. పైగా తన దగ్గర సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం రూ. 50 లక్షలే ఉంది. భవిష్యత్తులో తొందరగా రిటైర్ అయ్యేలా 'ఫైర్' గోల్ రీచ్ అవ్వాలని ఉందట. మరి మీరే తన ప్లేస్‌లో ఉంటే.. ఈ క్యాష్‌ను ఎలా రొటేట్ చేస్తారు? అంటూ నెటిజన్లను సలహాలు కోరాడు కుర్రోడు రెడిట్ వేదికగా.
ఈ స్టేజ్‌లో ఉన్న కుర్రోడికి రెడిట్ యూజర్లు కొన్ని క్రేజీ టిప్స్ ఇస్తున్నారు. ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను కనీసం రూ.2 కోట్ల 50 లక్షలకు పెంచమని సూచిస్తున్నారు. అత్యవసరంగా కుటుంబానికి సరిపోయే హెల్త్ పాలసీ తీసుకోమని చెప్పారు. బ్యాంకులో మూలుగుతున్న ఆ క్యాష్‌ను రియల్ ఎస్టేట్ ఫ్లిప్పింగ్ లేదా రెంటల్ ప్రాపర్టీస్‌లో పెడితే స్థిరమైన ఆదాయం వస్తుందని సలహా ఇచ్చారు.
