పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్కు చెందిన చల్ల హన్మంత్రెడ్డి తన ఇద్దరు కుమారులపై మంగళవారం వికారాబాద్ఆర్డీవో ఆఫీస్లో ఫిర్యాదు చేశారు.
చెరో ఏడెకరాల భూమి పంచిస్తే.. కుమారులు తనకు అన్నం పెట్టడం లేదని, కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారు తన పోషణ బాధ్యత చూసుకోకపోతే.. తాను కష్టపడి సంపాదించిన భూమిని తిరిగి తనకు ఇప్పించాలని కోరారు.
